హుయాన్ స్వాంగ్ చైనా దేశానికి చెందిన బౌద్ద భిక్షువు, యాత్రికుడు. భారతదేశాన్ని హర్షచక్రవర్తి పరిపాలించే కాలంలో భారత దేశాన్ని దర్శించాడు.
చైనాలో 604 సంవత్సరంలో జన్మించాడు. చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించాడు. క్రీ.శ. 629-645 మధ్యకాలంలో భారతదేశానికి వచ్చి నలందా, తక్షశిల విద్యాపీఠాలలో అధ్యయనం చేసాడు.
643 సం.లో కన్యాకుబ్జంలో హర్షవర్ధనుడు ఏర్పాటు చేసిన పాంచ వార్షక బౌద్ద మహాసభలో హ్యయాన్ సాంగ్ అధ్యక్ష పీఠాన్ని అలంకరించాడు. అలహాబాద్ లో జరిగిన బౌద్ద మహాసభలో పాల్గొని తిరిగి చైనాకు వెళ్లిపోయాడు.
ఇతను సేకరించిన బౌద్ద వస్తు సామాగ్రిలో బంగారు, వెండి, చందనాలతో చేసిన బుద్ద ప్రతిమలు, 657 బౌద్ద లిఖిత పత్రాలు ఇరవై గుర్రాలపై వేసుకుని చైనాకు వెళ్లాడు.
హుయాన్ సంగ్ వ్రాతలు భారతదేశ చరిత్రకు ఆధారాలుగా పనికి వచ్చియి. తను సేకరించిన బౌద్ద విషయాలను 74 సంపుటాల్లో చైనా భాషలో పొందుపరచాడు.